ఎర్ర మిరపకాయలు తింటే?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (23:24 IST)
ఎర్ర మిరపకాయలు. ఇవి వేసవి ప్రవేశిస్తుందనగా మార్కెట్లలో లభిస్తుంటాయి. వీటితో పచ్చళ్లు చేసుకుంటారు. అలాగే ఎర్ర మిరపకాయలను ఎండబెట్టి కారం తయారు చేస్తారు. ఇది అనేక మసాలా మిశ్రమాలు, సాస్‌లలో ఉపయోగిస్తారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరంలో వాపు, నొప్పిని తగ్గించే గుణం ఎర్ర మిరపకాయలకు వుంది.
 
జలుబు చేసినప్పుడు కాస్తంత ఘాటుగా కారంతో వున్న పచ్చడిని తింటే ముక్కు కారడాన్ని తగ్గిస్తుంది.
 
ఎర్ర మిరప కారం బరువు తగ్గడంలో సహాయపడుతుంది
 
తగిన మోతాదులో ఎండుమిరప పొడి వినియోగం గుండెకి మేలు చేస్తుంది.
 
ఎండు మిరపకాయలతో చేసిన కారం చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది.
 
ఎండుమిర్చి ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహిస్తుంది.
 
మోతాదుకి మించి తీసుకుంటే జీర్ణశయంలో సమస్య వస్తుంది కనుక జాగ్రత్త వహించాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు