యాలకలను రెండు రకాలలో లభిస్తుంటాయి. చిన్న యాలకులు లేదా పెద్ద యాలకులు. పెద్దపెద్ద యాలకలు తినుబండారాలలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగిస్తుంటారు. అదే చిన్న యాలకలు తీపి పదార్థాలలో కలుపుతుంటారు. మనం తినే ఆహార పదార్థాలలో మాత్రమే వీటిని ఉపయోగించుకుంటామనుకుంటే పొరపడినట్లే. ఇందులో ఔషధ గుణాలున్నాయి. ఆ ఔషధ గుణాలేంటో చూద్దాం.
దగ్గు : వర్షా కాలంలో జలుబు, దగ్గు, తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా వున్నప్పుడు యాలకలు, అల్లం ముక్క, లవంగ మరియు ఐదు తులసి ఆకులు కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
వాంతులు : వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీరు 1/4వ వంతు వచ్చినప్పుడు తీసి ఆ నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. దీంతో మంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్యనిపుణలు.