మెంతుల పొడిలో నిమ్మరసం, తేనె కలుపుకునీ...

సోమవారం, 1 అక్టోబరు 2018 (14:28 IST)
మెంతులలో క్యాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వానికి చాలా సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. మరి మెంతులకు వెంట్రుకలు లింకేంటో తెలుసుకుందాం. మెంతులను రాత్రివేళ నానబెట్టుకుని ఉదయాన్నే మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తేనె కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారు ముల్తానీ మట్టిలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, గుడ్డు తెల్లసొన కలుపుకుని తలకు రాసుకోవాలి. 
 
గంట తరువాత తలస్నానం చేయాలి. తరుచుగా ఇలా చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు ఎక్కువగా రాలుతుందా.. ఇలా చేస్తే.. అవకాడో మిశ్రమంలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు, తేనె కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేయడం వలన వెంట్రులకు రాలే సమస్యలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు