సాధారణంగా తలనొప్పి అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వస్తుంటుంది. ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు తీసుకోవడం మంచిది కాదు. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికి తెలిసిన విషయమే. కనుక తలనొప్పిని తగ్గించేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును.
గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకోసారి తలనొప్పి కడుపులో గ్యాస్ చేరడం వలన కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా భోజనంలో నెయ్యిని చేర్చుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. గ్లాస్ నీటిలో ధనియాలు, చక్కెర కలుకుని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.