అలాగే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. యూరినల్ ఇన్ఫెక్షన్లు, శరీరంలోని టాక్సిన్లు ఇట్టే దూరమవుతాయి. మూత్రపిండం శుభ్రం కావడంతో పాటు.. కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేయడమే కాదు.. జీవక్రియ రేటు కూడా మెరుగుపరుస్తాయి. అలా బరువును అదుపులోకి ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది.