ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటిని భర్తీ చేయవచ్చు. ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
*శరీర అవయవాల పనితీరుకు కావలసిన కాల్షియం, ఐరన్, మెగ్నీషం, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ ఖర్జూరంలో ఎక్కువగా ఉంటాయి.
*వీటిలోని విటమిన్ సి, డి చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
*ఖర్జూరంలో ఐరన్ మాడు భాగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి, కేశాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతేకాదు జట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది.