ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి..

శనివారం, 27 మే 2017 (18:08 IST)
ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. యాలకుల్లో శరీరానికి అవసరమయ్యే నూనెలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ బారి నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయి. కాబట్టి రోజూ భోజనం చేసిన తర్వాత యాలకులు తింటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.
 
యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి. కమ్మని వాసన, రుచిని అందించే యాలకులను తరచూగా నోట్లో వేసుకుంటే.. ధూమపానం, మద్యపానానికి దూరంగా వుండవచ్చు. యాలకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి