ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను తింటే ఎన్ని లాభాలో తెలుసా?

గురువారం, 14 జులై 2016 (15:41 IST)
చాలా మందికి బెల్లం అంటే ఇష్టముండదు. కానీ, బెల్లం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బెల్లానికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద మందుల తయారీలో బెల్లం వాడుతుంటారు. అలాంటి బెల్లం ముక్కను ప్రతి రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 
 
ప్రతి రోజూ భోజనం చేశాక కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధిపడుతాయి. రక్తం ప్రసరణ బాగా జరుగుతుంది. వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. 
 
చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినడం వల్ల మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మనశ్శాంతిని పెంచుతుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది.

వెబ్దునియా పై చదవండి