పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గించుటకు ఉపయోగపడుతాయి. అందుకు ప్రతిరోజూ పాలలో పసుపును కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అల్లం రసాన్ని తరచుగా తీసుకోవడం నొప్పుల నుండి బయటపడవచ్చును. లవంగాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా ఆలివ్ నూనెను కలుపుకుని నొప్పులున్నచోట రాసుకోవాలి.
గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనెను, యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలుపుకుని తాగితే నొప్పున నుండి ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి రెబ్బల్ని నలుపుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా ఉప్పును చేర్చుకుని నొప్పులున్న భాగంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.