బాదం పుప్పుతో హైపర్ టెన్షన్ చెక్...

శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:36 IST)
బాదం పప్పులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. హైపర్ టెన్షన్‌కు గురయ్యేవారు తరచుగా బాదం పప్పులను తీసుకోవడం వలన మంచి ఉపశమనం పొందుతారు. మహిళలు ప్రతిరోజూ ఉదయాన్నే బాదం పప్పులను తీసుకోవడం వలన శరీర ఒత్తిడి, అలసట తొలగిపోతుంది. బాదం పప్పు శరీరంలో ఐరన్‌ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది.
 
శరీరంలోని కండరాలు ఉత్సాహంగా పనిచేసేందుకు మంచిగా దోహదపడుతుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా గర్భంలోని శిశువు మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు వాల్‌నట్స్ చక్కగా పనిచేస్తాయి. 
 
పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి కావలసిన మెగ్నిషియాన్ని అందిస్తాయి. తద్వారా ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిస్తా శరీరంలోని జీవక్రియలను, థైరాయిడ్, బ్లడ్ షుగర్‌ను క్రమంగా రెగ్యులేట్ చేసేందుకు సహాయపడుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు