లవంగం నూనెతో ఆరోగ్యం

బుధవారం, 30 మార్చి 2022 (22:53 IST)
ఆరోగ్యానికి లవంగాలు ఎంతగానో మేలు చేస్తాయి. లవంగం నూనెలోని క్రిమిసంహారక గుణాలు దంత నొప్పి, పంటి నొప్పి, చిగుళ్లలో పుండ్లు, నోటిపూతలకు ఇది ఔషధంగా పనిచేస్తుంది. లవంగం నూనె బ్రోంకటిస్, జలుబు, సైనసిటిస్ మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులకు చికిత్స చేస్తుంది. ఎందుకంటే దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎక్స్‌పెక్టరెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వున్నాయి కాబట్టి.

 
ప్రతిరోజూ ఉదయం లవంగం నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, ఫ్లూ కేసుల నుండి  కాపాడుతుంది. లవంగం నీరు ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాల అద్భుతమైన మూలం. ఇది మాంగనీస్, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియంల గొప్ప మూలం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు