మహిళలపై దారుణాలకు ఎన్ని కఠిన చట్టాలొచ్చినా అడ్డుకట్ట పడట్లేదు. శనివారం బాసర సమీపంలోని జాతీయ రహదారిపై తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది. జిల్లాలోని నవీపేట్ మండలం మిట్టపూర్ శివార్లలోని హైవే పక్కన మృతదేహాన్ని పడవేసినట్లు పోలీసు వర్గాల సమాచారం.
మృతదేహాన్ని కనుగొన్న తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో ఆధారాలను సేకరించి నిందితులను పట్టుకునేందుకు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మహిళ మృతదేహం ఎవరిది అనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.