కొబ్బరితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు...

శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:08 IST)
కొబ్బరిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొబ్బరిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, బరువు తగ్గడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి తరచుగా తీసుకోవడం వలన పొట్టచూట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
 
ఈ కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. పాల కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ, గుండె మంటను తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన చర్మంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు