మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు, 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి, ఉబ్బసం, రక్తహీనత, మామూలు జలుబు, దగ్గు, నిస్సత్తువ వంటివి దరిచేరవు.
బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌తో కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గుతుంది.