అతిమూత్ర వ్యాధిని అడ్డుకునేందుకు ఈ పళ్లు తింటే చాలు

బుధవారం, 22 జులై 2020 (23:21 IST)
ఈ సీజన్లో నేరేడు పండ్లు బాగా వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అతి మూత్ర వ్యాధితో బాధ పడేవారికి ఉపశమనం కలుగుతుంది. ఎలాగంటే.. ఈ పండు గింజలను పొడి చేసి ఉదయం ఖాళీ కడుపుతో చన్నీళ్ళతో తాగితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. కాలేయానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ నేరేడు పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఈ పండులో సహజమైన యాసిడ్‌లు ఉన్నాయి. అవి కాలేయాన్ని శక్తివంతం చేసి దాని పని తీరును మెరుగుపరుస్తాయి.
 
2. పైల్స్ సమస్యతో బాధపడే వారికి నేరేడు బాగా పని చేస్తుంది. ఈ పండ్లను అవి దొరికే కాలంలో ప్రతి రోజు ఉదయం ఉప్పుతో కలిపి తింటే మంచి ఫలితం కలినిపిస్తుంది.
 
3. నేరేడులోని ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. గింజల్లో జంబోలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి నివారణకు దోహదపడుతుంది.
 
4. నేరేడు గింజలను ఎండబెట్టి పొడిచేసి రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిపై చక్కని ప్రభావం చూపుతుంది అని డాక్టర్లు చెపుతున్నారు.
 
5. ఈ చెట్టు బెరడును నలగ్గొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి కషాయం చేసుకొని దానిలో తేనే కలుపుకొని తాగితే రక్త స్రావం తగ్గిపోతుంది.
 
6. వైట్ డిశ్చార్జ్‌తో బాధ పడే మహిళలు ఈ చెట్టు వేర్లను దంచి ముద్ద చేసి బియ్యం కడిగిన నీళ్ళలో కలిపి తీసుకుంటే రక్తహీనత, వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు