సాధారణంగా మహిళలలో ముఫ్పై ఏళ్ల తరువాత ఎముకలలో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు పెళుసుబారి పోవడం, కీళ్లనొఫ్పులు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి. సమతులాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను దాదాపు రాకుండా చేయవచ్చు. ఎముకలు ధృడంగా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.
1. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో క్యాల్షియం, విటమిన్ -డి ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, తాజాపండ్లు, కాయగూరలు, గుడ్లు తీసుకోవడం వల్ల ఎముకలకు కావలసిన బలం చేకూరుతుంది. వీటికి అదనంగా చిరుధాన్యాలు, పండ్లరసాలు తీసుకుంటే మంచిది.
3. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరుబయట వ్యాయామం, పరుగు, నడక వంటివి చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఆరోగ్యంగాను ఉంటారు.