రాత్రివేళ కొబ్బరి, ఆలివ్ లేదా బాదం నూనెను చర్మానికి, చేతులకు రాసుకుని బాగా మర్దన చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. చక్కెరలో కొద్దిగా ఉప్పు, తేనె కలుపుకుని చేతులకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
నిమ్మరసంలో కొద్దిగా గ్లిజరిన్, రోజ్‌వాటర్ కలుపుకుని చేతులకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. కీరదోస గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకుని చేతులకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం ముడతలు తొలగిపోతాయి.