చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుందా?

మంగళవారం, 30 జులై 2019 (22:21 IST)
ఇటీవలకాలంలో చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీనికి కారణం అనారోగ్య సమస్యలు, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. వీటిని అధిగమించడానికి కృత్రిమంగా తయారయన ఉత్పత్తులు పలు రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ అవి సరిపడకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా సహజంగా లభించే పదార్థాలతో తెల్లజుట్టు సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. కొబ్బరినూనెలో నిమ్మరసం కలపి ప్రతిరోజు ఈ రసం తలకు రాసుకుంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా తెల్లజుట్టు రాకుండా ఉంటుంది.
 
2. ఉసిరి పొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దానిని ప్రతిరోజు తలకు రాసుకుని రెండు గంటలు ఆగి తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
 
3. ఉల్లిపాయను మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్టును తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. రెండు గంటలు ఆగిన తరువాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.
 
4. నువ్వులను మిక్సీలో వేసి పేస్టు చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీనిని తరచుగా తలకు రాస్తుండాలి.
 
5. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కూడా జుట్టు నల్లబడుతుంది. అంతేకాకుండ మనం తీసుకునే రోజూవారి ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్, బి12 ఎక్కువగా ఉండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు