చిన్నపిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్య... ఈ పదార్థాలు తీసుకుంటే?

శుక్రవారం, 19 జులై 2019 (20:24 IST)
ఇటీవలికాలంలో అనేకమంది కంటి చూపు సమస్యలతో సతమవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా దృష్టి లోపం వస్తున్నది. ముఖ్యంగా చిన్నమ పిల్లలు కంటి అద్దాలను ధరించ వలసి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, కంటి చూపు మెరుగుపడాలన్నా కొన్ని రకాల పదార్థాలను తరచూ మన ఆహారంలో తీసుకోవాలి. అవేంటో చూద్దాం.
 
1. బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టి సమస్యలను పోగొడతాయి. కంటి చూపు మెరుగయ్యేలా చూస్తాయి. ప్రతిరోజూ ఆరు బాదం పప్పును నీటిలో నానబెట్టుకుని పొట్టు తీసి తినాలి. ఇలా చేయడం వలన కంటి సమస్యలు పోతాయి.
 
2. ఉసిరికాయల్లో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూను ఉసిరికాయ జ్యూస్‌ని కలుపుకుని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తాగితే కంటి సమస్యలు తొలగిపోతాయి.
 
3. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే క్యారెట్స్, యాపిల్స్, పాలకూర, బీట్ రూట్, బ్రొకలి, కోడిగుడ్డు తదితర ఆహారాలను రోజూ తీసుకుంటే దృష్టి లోపం సమస్య నుండి బయటపడవచ్చు.
 
4. ఒక కప్పు బాదం పప్పు, సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకుని అన్నింటిని కలిపి పొడి చేయాలి. ఈ పొడిని ఒక టేబుల్ స్పూను మోతాదులో తీసుకుని రాత్రిపూట నిద్రించేందుకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వలన కొన్ని రోజుల్లోనే కంటిచూపు మెరుగవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు