గోధుమ గడ్డి రసాన్ని దంతాలకు రాసుకుంటే..?

గురువారం, 17 జనవరి 2019 (14:33 IST)
దంతాల మధ్య సందులు, దంతాల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. వీటిని ఇలానే వదిలేస్తే.. దంతాలు, చిగుళ్ల నొప్పి, ఇతర సమస్యలతో పాటు పలురకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మరి అందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. ఈ చిట్కాలు పాటించండి చాలు...
 
1. గోధుమ గడ్డి రసాన్ని దంతాలకు రాసుకుని రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే వేపాకు చెక్కలతో పళ్లను కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నొప్పులు కూడా రావు.
 
2. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలను శుభ్రం చేసేందుకు ఎంతగానో దోహదపడుతాయి. దంతాల సమస్యలతో బాధపడేటప్పుడు కొద్దిగా పసుపు దంతాలకు, చిగుళ్లకు రాసుకుంటే సమస్య అదుపులో ఉంటుంది.
 
3. ప్రతిరోజూ ఓ చిన్న అల్లం ముక్కను నమిలితే దంతాలు, చిగుళ్ల సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు, కొన్ని పుదీనా ఆకులు వేసి నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత తీసుకుంటే.. దంత వ్యాధులు రావు. 
 
4. దంతాలు నొప్పిగా ఉన్నప్పుడు ఓ చిన్న ఉల్లిపాయను తీసుకుని కట్ చేసి దానిని బాగా నమిలి తినాలి. ఇలా రోజుకు 1 లేదా 2 ఉల్లిపాయలు తింటే దంతాల నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గుముఖం పడుతాయి.
 
5. ఓ చిన్న బ్యాగ్‌లో కొన్ని ఐస్ ముక్కలు వేసి దంతాలపై పెట్టుకోవాలి. అలానే గోరువెచ్చని ఉప్పు నీటిని నోట్లో పోసుకుని కొన్ని సెకండ్ల పాటు అలానే ఉంచుకోవాలి. ఇదే పద్ధతిలో సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు చేస్తే నొప్పి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు