మునగకాడలను పొడిచేసి తీసుకుంటే..?

గురువారం, 17 జనవరి 2019 (12:54 IST)
మునగకాడల గురించి తెలియని వారుండరు. మునగ ఆకులు, చెట్టు బెరడు, వేర్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. లేత మునగ చిగుళ్లను రుబ్బి రసం తీసి, రోజూ పరగడుపున చిన్న గ్లాస్ తాగితే బరువు తగ్గుతారు. 
 
మునగాకను, కాడలను మెండుగా తీసుకుంటే బాలింతలకు పాలు బాగా పడతాయి. ఆకును ఎండబెట్టి, ఎండబెట్టి, పొడిచేసి పరగడుపున ఓ చెంచాడు తింటే కడుపులో ఉన్న అల్సర్లు మానిపోతాయి.
 
మునగచెట్టు బెరడు నుంచి తీసిన జిగురును ఆవుపాలతో కలిపి నుదుటి మీద పట్టీలా వేస్తే తలనొప్పి మాయమవుతుంది. మునగచెట్టు వేరును దంచి, రసం తీసి, తేనెలో కలిపి, తాగితే వాతపు నొప్పులు తగ్గుతాయి. లేత మునగాకును తరచుగా తింటే ఒంటికి పట్టిన నీరు తీసేస్తుంది. మునగాకును వేయించి తినిపిస్తే, పిల్లలు పక్క తడపడం మానేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు