అందమైన ముఖానికి చక్కని చిరునవ్వు ఓ ఆభరణం వంటింది. అయితే, మనసారా నవ్వాలంటే పలువరుస బాగుండాలి. ఆ పళ్ళు పచ్చగా ఉంటే హాయిగా నవ్వలేరు కూడా. పైగా, ఆ పచ్చని గార ఎంత దాచుకుందామన్నా దాగనిది. అలాంటిగారను పోగొట్టేందుకు చాలామంది రెండు పూటలా బ్రష్ చేస్తుంటారు. అయినప్పటికీ పచ్చని గార దంతాలను వదిలిపోదు.
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. అంతే.. మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.