షాకింగ్... బోయ్ ఫ్రెండుకి బొడ్డును బహుమతిగా కోసిచ్చిన ప్రేయసి...

బుధవారం, 31 అక్టోబరు 2018 (16:37 IST)
ప్రేయసి కోసం ప్రియుడు రక్తంతో ప్రేమలేఖ రాయడం, ప్రియురాలి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం... తదితర వార్తలను మనం చూస్తూ వున్నాం. కానీ తన ప్రియుడు కోసం ఓ ప్రేయసి చేసిన పని మాత్రం షాకింగ్‌గా మారింది. 
 
తన ప్రియుడికి తన శరీరంలోని బొడ్డు(నాభి) అంటే ఎంతో ఇష్టమని, ఆ బొడ్డును కాస్తా కోసి తన ప్రియుడికి బహుమతిగా ఇచ్చేసింది. లండన్‌కు చెందిన 23 ఏళ్ల పౌలీనా ఈ పని చేసింది. ఐతే తన బొడ్డును ప్రియుడికి బహుమతిగా ఎందుకివ్వాలని అనుకున్నదో వివరించింది కూడా. 
 
లోకంలో ప్రేయసి కోసం ప్రియుళ్లు చాలా చేస్తుంటారనీ, అలాగే ప్రియుడి కోసం ప్రేయసి కూడా అద్భుతం చేస్తుందని చూపించేందుకే తన బొడ్డును కోసి ఇచ్చానని సంతోషంగా చెపుతోంది. మరి ఆ బొడ్డుతో ఆమె ప్రియుడు ఏం చేసుకుంటున్నాడో..? 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు