చర్మానికి నూనె రాసుకుంటున్నారా? ఇన్ఫెక్షన్లు ఎందుకొస్తాయో తెలుసా?

మంగళవారం, 11 అక్టోబరు 2016 (18:08 IST)
దురదలు, ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయో తెలుసా? దురదలకు.. నూనె రాయకపోవడానికి లింకుందా? అనే ప్రశ్నలకు వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. చర్మం పొడి బారితే తప్పకుండా ఇన్ఫెక్షన్లు వెతుక్కుంటూ వస్తాయని వారు అంటున్నారు. చర్మం పొడిబారడానికి కారణం.. చర్మంలో నూనె గ్రంథుల సంఖ్య తగ్గిపోవడమే. దీంతో దురద తప్పదు. 
 
అందుకే దురదలు, ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు సరైన పరిష్కారం.. చర్మానికి నూనె రాసుకోవటమే. 250 ఎం.ఎల్‌. కొబ్బరినూనె, 250 ఎం.ఎల్‌. నువ్వుల నూనె, 100 ఎం.ఎల్‌. ఆముదాన్ని ఒక సీసాలో పోసుకొని పెట్టుకోవాలి. స్నానం చేసేందుకు అరగంట ముందు దీన్ని ఒంటికి రుద్దుకోవాలి. 
 
స్నానం చేశాక బేబీ ఆయిల్‌ను ఒంటికి రాసుకోవాలి. దీంతో చర్మం పొడిబారటం.. దురద పెట్టటం వంటివి తగ్గుతాయి. ఇలా వారానికి రెండు సార్లు లేదా ఒక్కసారి చేసినా, లేదా ప్రతిరోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి