ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

సిహెచ్

మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (13:32 IST)
శరీరంలో రక్త ప్రసరణను పెంచి మనల్ని చురుకుగా ఉంచేది ఐరన్. పండ్లు, కూరగాయలతో తయారుచేసిన పానీయాలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాము.

బీట్‌రూట్ రసంలో మాంగనీస్, ఐరన్, విటమిన్ సిలు ఎర్ర రక్త కణాలకవసరమైన ఆక్సిజన్ వినియోగాన్ని పెంచుతాయి.
గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి రోజుకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
ఎండిన రేగు పండ్ల నుండి తయారైన ప్రూనే జ్యూస్‌లో రోజువారీ అవసరాలలో 17 శాతం ఇనుము ఉంటుంది. ఇది శరీరాన్ని చురుకుగా చేస్తుంది.
నిమ్మకాయ, కొత్తిమీర, బచ్చలికూర, దోసకాయలను కలిపి తయారుచేసిన గ్రీన్ జ్యూస్ శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది.
ఖర్జూరం, దానిమ్మలతో చేసిన పానీయం శరీరానికి ఇనుమును అందిస్తుంది.
పాలు, తేనె, నువ్వులను కలిపి పానీయంగా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు