ఇలా చేస్తే బ్రెయిన్ షార్పవ్వడం చాలా ఈజీ...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (13:29 IST)
చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు వెళ్ళిన తర్వాత మరిచిపోతుంటారు. కానీ అలాంటి వారు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి మెదడు షార్ప్ అవ్వడమే కాదు. ఇక చదివింది ఎప్పుడూ అస్సలు మరిచిపోలేరు.
 
చదువుకున్న వారికి అందరికీ తెలుసు ఎ టు జెడ్ గురించి. ఎ గురించి అడిగితే మొదటి అక్షరం అంటారు. జెడ్ అంటే 26వ అక్షరమని ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరు. కానీ మధ్యలో ఉన్న అక్షరాలు ఏ సంఖ్యలో ఉన్నాయో గుర్తుపెట్టుకొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మెదడును షార్పవడమే కాకుండా మీరు చదివే వాటిపై కూడా దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చట. 
 
ఉదయం లేచినప్పుడుగాని, లేక పడుకునే ముందుగానీ ఎ నుంచి జెడ్ వరకు మధ్యలో వచ్చే అక్షరాలు ఎం అనుకోండి ఇది 13వ సంఖ్య.. ఇలా ప్రతి అక్షరంను గుర్తుపెట్టుకుంటే అదే మెదడును పదును పెట్టినట్లు. ఎ టు జెడ్‌ను అనర్గళంగా సంఖ్యల్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మెదడు పదునైనట్టే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు