చలికాలంలో జలుబు, దగ్గు అనేవి సర్వసాధారణం. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో పాటు చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వీటికి కారణంగా చెప్పొచ్చు. అయితే, ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకున్నట్టయితే చిన్నపాటి అనారోగ్యాలబారిపడకుండా జాగ్రత్తపడొచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
అల్లం : తేనెతో కలిపి అల్లం ముక్కలనుగానీ, అల్లం రసంనుగానీ రోజూ తీసుకున్నట్టయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిదేరవు. జీర్ణశక్తి కూడా మెరుగ్గా ఉంటుంది.
డ్రైఫ్రూట్స్ : ఎక్కువ వేయించిన ఆహార పదార్థాలు, కూరలు జీర్ణాశయం పనితీరుపై ప్రభావితం చూపిస్తాయి. డ్రైఫ్రూట్స్‌ను స్నాక్స్‌గా, ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.