తాటి కల్లు దివ్యౌషధమా?

బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (20:31 IST)
తాటికల్లు దివ్యౌషధమని చెపుతారు. ఇందులో సమృద్ధిగా ఖనిజ లవణాలు, విటమిన్లు వుండటంతో ఊబకాయం, మధుమేహం నియంత్రణకు మంచిది. రోగనిరోధకశక్తి అధికమని తేలింది. పూర్వీకులు చెప్పినట్లు తాటిచెట్టు కల్పవృక్షమే. తాటికల్లు సుమధురమైన దివ్య ఔషధమే. స్వర్గలోకంలో అమృత భాండం ఒలికి జారిన అమృతపు చుక్క భూమ్మీద పడి తాటి వృక్షమై మొలిచినదట.

ఇందులో వాస్తవమెంత ఉన్నా ఆ వృక్షం ప్రసాదించే కల్లు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది తాజా పరిశోధనలో సేవిస్తే ఈ పానీయం ఆయురారోగ్యాలకు రక్షణగా నిలుస్తుంది. శరీరానికి జవసత్వాలను ఇస్తుంది. బహుశా ఈ సత్యాన్ని గుర్తించి కాబోలు పూర్వకాలం నుంచే పిల్లలు, మహిళలు, వృద్ధులు సైతం ప్రత్యేక సంధర్భాల్లో దీన్ని సేవిస్తూ ఉంటారు. 
 
సురాపానంగా వ్యవహరించే తాటికల్లులో అనేక ఔషధ గుణాలున్నాయి. దేహానికి అవసరమైన పోషకాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. తగిన మోతాదులో సేవిస్తే ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా రోగాలు రాకుండా కాపాడుతుంది. తాటికల్లుపై జాతీయ పోషకాహార సంస్థ పరిశోధన చేసి ఇందులో ఉన్న పోషక విలువలను గుర్తించింది.

వెబ్దునియా పై చదవండి