రాగి జావను పాలలో, మజ్జిగలో కలుపుకుని తాగితే.. పిల్లలకు పుష్కలమైన క్యాల్షియం అందుతుంది. రాగులతో చేసే వంటకాలను తీసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులతో చేసే వంటకాల ద్వారా కడుపులో మంట తగ్గిపోతుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది.