గులాబి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీని ఇష్టపడని వారుండరు. గులాబి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గులాబీలను సౌందర్య సాధనంగా మరియు వంటకాల్లో సైతం వాడుతారు. ఇందులో విటమిన్ ఎ, బి3 లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్, క్యాల్షియం, జింక్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం....
1. గులాబీ నీరు(రోజ్ వాటర్) ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టీస్పూన్ తీసుకుని బాగా కలిపి వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని కంటి ఎరుపుదనం, కళ్ల కలక లాంటి సమస్య ఉన్నప్పుడు రోజుకు మూడుసార్లు ఒక్కో కంట్లో రెండు చుక్కలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కంటి మంట, కంటి దురద, కంటి అలర్జీలు కూడా తగ్గుతాయి.