వెల్లకిలా నిద్రిస్తూ గురకపెడితే సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు మూసుకొని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకుని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. అయితే ఎలా నిద్రించినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలని వారు హెచ్చరిస్తున్నారు.
గురక సమస్య నుంచి దూరం కావాలంటే.. అర టీ స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. రెండు టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీ స్పూన్ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.