నవరాత్రి స్పెషల్.. పనీర్ పాయసం ఎలా చేయాలి..?

శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:12 IST)
నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకో నైవేద్యం సమర్పించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహార పదార్థాలను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వంటకాల్లో ఒకటే పనీర్ పాయసం. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్ పాయసం తీసుకోవడం ద్వారా దంతాలకు, ఎముకలకు మేలు జరుగుతుంది. వ్యాధి నిరోధకత పెరుగుతుంది.
 
పనీర్ పాయం తయారీ ఎలా?
కావలసిన పదార్థాలు:
పన్నీర్ తరుగు- ఒక కప్పు 
చిక్కగా కాచిన పాలు - రెండు కప్పులు 
పాలు - అర లీటరు 
నట్స్, డ్రైఫ్రూట్స్ తరుగు- గార్నిష్ కోసం 
యాలకుల పొడి- అర స్పూన్ 
 
తయారీ విధానం:
పన్నీర్ తరుగును వేడైన పెనంలో దోరగా వేపాలి. అందులో పాలను కలపాలి. ఐదు నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే వుండాలి. ఆపై గట్టిపాలను కూడా  పోసి మరో ఐదు నిమిషాల పాటు కలపాలి. అందులో యాలకుల పొడిని కలపాలి. డ్రై ఫ్రూట్స్, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయాలి. బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవాలి. తరిగిన బాదం, నట్స్‌తో అలంకరించుకుని చల్లారాక సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు