వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వేసవిలో నీరసం రాకుండా ఉండాలంటే.. ద్రవాహారంపై అధిక శ్రద్ధపెట్టాలి. వేసవికాలంలో పోషకాహారంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ద్రవాహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో మజ్జిగ కూడా ఒకటి. వేసవిలో రోజూ తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేసి... దగ్గును, జలుబును నివారిస్తుంది.
అలాగే పుదీనాను ఎండాకాలంలో తప్పక తీసుకోవాలి. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు. పుదీనాతో మంచి ఫ్లేవరబుల్ చట్నీలు చేసుకోవచ్చు. ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. పుచ్చకాయను వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ పుచ్చకాయ. వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది. నిమ్మకాయను శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమవుతాయి. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి బోండాం నీరు దోహదం చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తుంది. ఇకపోతే.. జామకాయలో విటమిన్ 'సీ' పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.