వేసవికాలంలో శారీరక సమస్యలు రాకుండా ఉండాలంటే?

మంగళవారం, 10 మార్చి 2020 (21:03 IST)
వేసవిలో వచ్చే శారీరక సమస్యల్లో ముఖ్యమైనది చెమట. ఇది అన్ని వయస్సుల వారికి ఉండే ఇబ్బంది. శరీరం మీద చెమట అలాగే నిలిచిపోయినప్పుడు దుర్వాసన రావడం, చెమట పొక్కులు రావడం, చర్మం జిడ్డుగా తయారవడం సాధారణం. మరికొన్ని ప్రాంతాల్లో చెమట ఎండిపోయి శరీరం మీద, దుస్తుల మీద తెల్లటి చారలు ఏర్పడతాయి. కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా వీటిని నివారించడానికి ప్రయత్నించవచ్చు.
 
ఎక్కువగా చెమట పట్టేవారికి శరీరంలో ఉండే లవణాలు అధికంగా బయటకు వస్తాయి. అందుకని వారు మంచినీటిలో ఉప్పు, పంచదార మొదలైన లవణాలను కలుపుకుని తాగితే తగినంత శక్తి వస్తుంది. ఒక స్పూన్ తేనెలో కాస్త మిరియాల పొడి కలుపుకుని తింటే చెమటకాయల నుంచి కూడా తప్పించుకోవచ్చు.
 
ఈ కాలంలో స్నానానికి వాడే సబ్బులు ఎక్కువ సువాసన వచ్చేవాటికన్నా మురికిని పొగోట్టేవిగా ఉండాలి. అలాగని ఎక్కువ రసాయనాలు ఉండే సబ్బులు వాడకూడదట. అలాగే వీపు భాగంలో చెమట అధికంగా పట్టి పేలే అవకాశం ఉంది. అందుకని ప్రత్యేకమైన బ్రష్‌‌తో వీపును శుభ్రపరుచుకుని పౌడర్ రాసుకోవాలి. 
 
అలాగే పాదాలు, వ్రేళ్ళ మధ్యలో ముందుగా గులాబీ రేకులు, మల్లెలు వేసి ఆ తరువాత స్నానం చేస్తే శరీరం సువాసన భరితమవుతుంది. గోరువెచ్చని నీటిలో రసం పిండేసిన నిమ్మకాయ చెక్కలు, ఆకులు, వేప ఆకులు వేసుకుంటే చర్మం జిడ్డు కారడం తగ్గుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు