ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తీసుకుంటే?

శుక్రవారం, 13 మార్చి 2020 (21:32 IST)
క్రిములు చేతుల పైనే కాదు... నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను తీసుకోవాలి.
 
స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఈ సమస్యకు మంచి ఉపసమనం కలుగుతుంది.
 
రోజులో ఒకటిన్నర స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. ఉప్పు అధికంగా వాడటం వల్ల గుండె జబ్బు రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
 
 రోగనిరోధక వ్యవస్థ దృఢంగా పనిచేయాలంటే... క్రిములు, ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండకూడదు. అందుకే... పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అయితే వాటిని తినేముందు ఒకటికి రెండుసార్లు కడగాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు