హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ చిత్రం సక్సెస్ మార్గంలో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా థాంక్ యూ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా టీమ్ అంతా విజయోత్సవ సాంగ్ కు డాన్స్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం తేజ సజ్జా మాట్లాడుతూ, సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్ గా రీల్స్ చేస్తూ ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే ఆనందంగా అనిపించింది. మా వెనుక ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు నిర్మాత విశ్వ ప్రసాద్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనోజ్ గారికి థాంక్యూ సో మచ్. రానా కి హృదయపూర్వక కృతజ్ఞతలు. హనుమాన్ సినిమాకి ఆయన నాకు సపోర్ట్ చేసిన విధానం మర్చిపోలేను. జగపతి బాబు. శ్రీయ, జయరాం వీళ్ళందరూ చాలా గొప్ప నటులు. మిరాయ్ అందరికీ నచ్చే సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి. థాంక్యూ.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. 2017లో స్టార్ట్ అయింది. గూడచారి మాకు ఫస్ట్ క్రెడిబిలిటీ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రతి ఏడాదిలో దాదాపు పది సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2024 అంతగా కలిసి రాలేదు. ఇలాంటి సమయంలోమిరాయ్ లాంటి అద్భుతమైన విజయం మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. ఈ సినిమాని మా దగ్గరికి తీసుకు వచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి ఈ క్రెడిట్ ఇస్తాను. కార్తీక్ తో నిన్ను కోరి సినిమా నుంచి మాకు మంచి రిలేషన్ ఉంది. ఈ స్పాన్ లో కచ్చితంగా కార్తీక్ చేయగలడనే నమ్మకం నాకు మొదటినుంచి ఉంది నాకు. నేను చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాను. నాకు డబ్బు విలువ తెలుసు. ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో కూడా తెలుసు. కార్తికే కథ చెప్పినప్పుడే తేజా లాంటి కమిట్మెంట్ ఉన్న హీరోతో చేయాలనుకుని అనుకున్నాం. అప్పటికి హనుమాన్ కూడా ఇంకా రాలేదు. నాకు తేజాతో బేసిక్ ఇంట్రక్షన్ ఉంది. ఓ బేబీ చేసాం. మా నమ్మకం ఈరోజు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో ఆడియన్స్ నుంచి గొప్ప క్రెడిబిలిటీ సంపాదించాము. అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కార్తీక్ తేజ మనోజ్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గౌరహరి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నెక్స్ట్ నాలుగు సినిమాలు కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. రానా గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. హిందీలో రిలీజ్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్యూ. మీడియా వారికి థాంక్యూ. ఈ సినిమాకి అద్భుతమైన విఎఫ్ఎక్స్ వర్క్ చేసిన మా టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమా అద్భుతంగా సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. మా అమ్మాయి కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా తన జర్నీ మొదలుపెట్టి ఈ సినిమాతో నిర్మాతగా మారారు. తను మా లక్కీ చార్జ్ అని భావిస్తున్నాం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ.
డైరెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 2021 లో ఈ సినిమా ఐడియా చెప్పాను తేజకి. అప్పటినుంచి ట్రావెల్ అవుతున్నాం. నాలుగేళ్లు జర్నీ అంత ఈజీ కాదు. నన్ను బిలీవ్ చేసిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్యు. మనోజ్ గారితో కలిసి షూట్ చేయడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి రైటింగ్ వెరీ లాంగ్ టైం ప్రాసెస్. మణి గారు నాతో మూడేళ్లు పాటుగా ఉన్నారు. ఈరోజు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న మూమెంట్స్ అవన్నీ రైటింగ్ నుంచి వచ్చినవే. హరి అద్భుతమైన ప్యాషన్ తో ఈ సినిమాకి గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. జగపతి బాబు గారికి జయరాం గారికి శ్రీయ గారికి స్పెషల్ థాంక్స్ . రానా గారు నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అడగ్గానే ఈ ప్రాజెక్టులో భాగమైన ఆయనకి కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హీరోయిన్ రితిక నాయక మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా నిర్మాత విశ్వ ప్రసాద్ గారికి కృతి ప్రసాద్ గారికి థాంక్యూ. వాళ్లు ఈ సినిమాకి ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా నిలబడ్డారు. నాకు విభా లాంటి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థాంక్యూ ఇది. చాలా స్పెషల్ క్యారెక్టర్ నా మనసులో ఎప్పుడూ నిలిచిపోతుంది. మనోజ్ గారి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తేజ వెరీ డెడికేటెడ్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. టీమ్ అందరికీ థాంక్యు.
మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా మాట్లాడుతూ.. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా నిర్మాత విశ్వప్రసాద్ గారు, డైరెక్టర్ గారు కార్తిక్ గారు, హీరో తేజ గారు, మనోజ్ గారు అందరికీ థాంక్యు. మా మ్యూజిక్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యు. ఈ వేడుకలో మిరాయ్ యూనిట్ అంతా పాల్గొన్నారు.