అత్తి పండు లేదా అంజీర డ్రై ఫ్రూట్. ఈ ఎండిన పండుతో పలు ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఐతే అదేసమయంలో కొందరికి ఈ పండ్లు సరిపడవు. సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. అత్తి పండ్లను అతిగా తినడం వల్ల కడుపులో భారంగానూ, కడుపు నొప్పి వస్తుంది. అత్తి పండ్లను ఉబ్బరం చేస్తుంది. అత్తి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, కనుక తక్కువ వ్యవధిలో వాటిని ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.
అత్తి పండ్లను అతిగా తినడం వల్ల చర్మానికి సున్నితత్వం పెరిగి తద్వారా చర్మానికి హాని కలిగించవచ్చు. అత్తిపండ్లు అధికంగా తింటే కాలేయానికి హాని చేయవచ్చు, వాటి విత్తనాల వల్ల ప్రేగులలో అడ్డంకిని కూడా కలిగిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది కానీ రక్తంలో చక్కెర స్థాయిలు మరీ తక్కువున్నవారికి హానికరం. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటే అత్తిపండ్లను తినడం మానుకోవాలి.