దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అదేసమయంలో ఈ వ్యాధిబారినపడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాగే, పండ్లు ఆరగించాలన్నా భయపడుతుంటారు.
మధుమేహంతో బాధపడుతున్నవారు ద్రాక్ష, యాపిల్, దానిమ్మ, జామపండ్లు, నారింజ, నేరేడు పండ్లు, అంజీర్, పైనాపిల్ పండ్లను నిర్భయంగా ఆరగించవచ్చు. ఈ పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంతగా పెరగవు. అందువల్ల మధుమేహ రోగగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా ఆరగింవచ్చని తెలిపారు.