జామ పండును ఎవరు తినకూడదు?

బుధవారం, 19 జులై 2023 (17:22 IST)
జామ పండు. జామకాయల్లో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. గుండె బలహీనంగా ఉన్నవారు, క్షయవ్యాధితో బాధపడేవారు, బహిస్టు నొప్పులు అధికంగా ఉన్నవారు జామ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఐతే జామకాయలు మోతాదుకి మించి తీసుకుంటే సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. జామకాయలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉండటం వల్ల జామను మోతాదుకి మించి తింటే కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామపండ్లు ఉత్తమమైన పండ్లలో ఒకటిగా చెప్పబడినప్పటికీ, మోతాదుకి మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. జామపండును రాత్రిపూట తినకూడదు, ఎందుకంటే ఇది జలుబు- దగ్గుకు కారణమవుతుంది. ఇప్పటికే పంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే, ఈ పండును తినకుండా వుండటం మంచిది.
 
బాగా మగ్గిపోయిన జామపండును తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. కనుక అలాంటి వాటిని తినకపోవడమే మంచిది. మరీ పచ్చిగా ఉన్న జామకాయల్లో పాస్పారిక్, ఆక్సాలిక్ వంటి ఆమ్లాలు ఉంటాయి, వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువగా గింజలు ఉన్న జామపళ్లను తింటే అపెండిసైటిస్(24 గంటల జబ్బు) వచ్చే ప్రమాదం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు