అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే..

ఆదివారం, 16 డిశెంబరు 2018 (15:34 IST)
బెల్లం లేదా చక్కెర అంటే ఇష్టపడని వారుండరు. ఈ రెండింటిని అమితంగా ఆరగిస్తుంటారు. అయితే, బెల్లం తినడం కంటే కూడా చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ చక్కెర వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. 
 
* శరీరంలోకి అధిక మోతాదులో చక్కెర చేరినట్టయితే కాలేయం దెబ్బతింటుంది. 
* అధికంగా చక్కెరను తీసుకోవడం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. 
* ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల దంతాలు పుచ్చిపోతాయి. చెడు బ్యాక్టీరియా నోరంతా వ్యాపిస్తుంది. 
 
* శరీరంలో చక్కెర చేరడం వల్ల మధుమేహం వ్యాధి వస్తుంది. 
* శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ చక్కెరలో ఉండవు. 
* ప్రాసెస్సింగ్ ఫుడ్స్, శీతలపానీయాలు తాగడం వల్ల అధిక బరువు పెరుగుతారు. 
* శరీరంలో చక్కెర స్థాయి ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల బారినపడుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు