ఇపుడు ప్రతి ఒక్కరూ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇలాంటి వారు మంచి పౌష్టికాహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి మటుమాయం కావడమేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకున్నట్టయితే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఆహార పదార్థాలేంటో ఇపుడు తెలుసుకుందాం.
చేపలు : చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. అందువల్ల వారానికి కనీసం రెండుసార్లు చేపలను తీసుకున్నట్టయితే శరీరానికి విటమిన్ డి అందుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారి వెన్నునొప్పితో పాటు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి.