యోగాసనాలు వేస్తే... ఊబకాయం నుండి...

బుధవారం, 20 జూన్ 2018 (11:06 IST)
ఊబకాయం అన్నది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తొంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు అనేవి కొందరిలో ఈ ఊబకాయాన్ని కలిగిస్తుంటాయి. అలాగే మరికొందరిలో కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వలన రకరకాల వ్యాధులతో ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దేహంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండడం వలన ఊబకాయాని గురికానున్నారు.
 
ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఊబకాయాన్ని తగ్గించేందుకు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఈ ఊబకాయ సమస్యల నుండి తప్పించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
 
జిమ్‌లకు వెళ్లడం, వైబ్రేషన్ బెల్ట్‌లు వాడడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం చాల కష్టంగా ఉంటుంది. ఈ రకమైన ఊబకాయం సమస్యలు ఉన్నవారు దాని నుండి బయటపడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటికి వ్యాధులతో బాధపడేవారికి యోగా చక్కగా ఉపయోగపడుతుందని యోగా నిపుణు చెబుతున్నారు.
 
యోగాసనాలు చేయడం వలన ఊబకాయ సమస్యలను సులభంగా దూరం చేయవచ్చును. యోగా నేర్చుకుని రోజూ ఓ నాలుగైదు రకాల ఆసనాలు వేయడం వలన ఊబకాయాన్ని చాల సమర్థంగా తగ్గించుకోవచ్చును. యోగాసనాలు ద్వారా కేవలం ఊబకాయం సమస్యలు మాత్రమే కాకుండా హైబీపీ, మధుమేహం లాంటి రుగ్మమతలను సైతం అదుపులో పెట్టవచ్చని యోగా నిపుణులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు