హైహీల్స్ వేసుకోవడం వల్ల కాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. హీల్ సైజ్ పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా నిలబడక పోవడం వలన కండరాలపై అధికంగా ఒత్తిడి పడుతుంది. ఒక అంగుళం ఉన్న హీల్ వలన 22 శాతం, రెండు అంగుళాల హీల్ వలన 57 శాతం, మూడు అంగుళాల హీల్ వలన 76శాతం అధిక భారం పాదాలపై పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
అలాగే నడుము క్రిందిభాగంలో ఒత్తిడిపడి కొంచెం వెనక్కి వంగిపోయి ఛాతీభాగం ముందుకు వస్తుంది. అందువల్ల స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. కాళ్లకు పాదాలకు మధ్య రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నరాలు బలహీనంగా మారి అనేక సమస్యలు వస్తాయి. మోకాళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది.