అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఓ కప్పు తోటకూర వండుకుని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి తోటకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం.
అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. తోటకూర హైబీపీని నియంత్రిస్తుంది. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి.
తోటకూర రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివి సమకూర్చుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ తోటకూర తీసుకోవడం ద్వారా పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.