ఆడవారు గాజులను ధరించడం అనేది భారతీయ సాంప్రదాయం. పురాతన కాలంలో కేవలం మగవారే బయటికి వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మహిళలు ఎప్పుడూ ఇంటిపట్టునే ఉండి తక్కువగా శ్రమిస్తారు కాబట్టి వారికి గాజులను ధరింపజేసేవారు. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.
పిల్లలకు చెవులు కుట్టించడం: చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.