హాలీవుడ్ సినీతార జెనీఫర్ ఆనిస్టన్‌కు ప్రేమ అచ్చొచ్చినట్లేదు. తన బాయ్‌ఫ్రెండ్ జాన్ మేయర్‌తో తన సంబంధాలను జెనీఫర్ తెగతెంపులు చేసుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మేయర్‌ను వదిలిపెట్టిన ఆనిస్టన్ తాజాగా రాకెన్ రోలా స్టార్ గెరార్డ్ బట్లర్‌తో డేటింగ్ జరుపుతోందని సన్ మ్యాగజైన్ వెల్లడించింది.
న్యూయార్క్‌లోని ఫ్రెండ్స్ స్టార్ అనే అపార్ట్‌మెంట్‌లో ఆనిస్టన్, బట్లర్‌తో రొమాన్స్ చేసిందని యూఎస్ మ్యాగజైన్ పేర్కొంది. 2005లో ప్రముఖ హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్‌తో ప్రేమాయణం కొనసాగించిన ఈ 40 ఏళ్ల ఆనిస్టన్, ఇప్పటికే విన్స్ వాగన్, జాన్ మేయర్‌లతో కూడా డేటింగ్ జరిపినట్లు సన్ మ్యాగజైన్ తెలిపింది.