జురాసిక్ వరల్డ్ దిమ్మతిరిగే కలెక్షన్స్: ఇప్పటికీ రూ.9వేల కోట్లు.. వామ్మో!!

గురువారం, 23 జులై 2015 (14:36 IST)
''జురాసిక్ వరల్డ్'' కలెక్షన్స్ వింటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో వసూళ్లు రాబడుతున్న జురాసిక్ వరల్డ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఇప్పటికీ రూ.9వేల కోట్లకు పైగా వసూలు చేసిందట. దాంతో భారీ వసూళ్లు రాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో చిత్రంగా జురాసిక్ వరల్డ్ నిలిచిందట. 
 
మొదటి రెండు స్థానాల్లో దర్శకుడు జేమ్స్ కేమరాన్ రూపొందించిన అవతార్, టైటానిక్ చిత్రాలున్నాయి. ఈ నేపథ్యంలో జురాసిక్ వరల్డ్ సినిమాకు చైనా, అమెరికా నుంచి భారీ కలెక్షన్స్ వచ్చాయట. ఇక ఈ సినిమాను నిర్మించిన యూనివర్సల్ స్టూడియో ఒకే సంవత్సరంలో రెండు భారీ చిత్రాలు తెరకెక్కించిన సంస్థగా కూడా రికార్డును కైవసం చేసుకుందట. 
 
ఈ ఏడాదిలో ఐదు చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తే వాటిలో రెండు చిత్రాలైన 'ఫ్యూరియస్-7', 'జురాసిక్ వరల్డ్' చిత్రాలు యూనివర్సల్ స్టూడియో నుంచి వచ్చినవి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి