హాలీవుడ్‌లో నటీనటులు ఒకరికొకరు నచ్చితే కలిసి జీవించడం(డేటింగ్) మామూలే. అలాగే వీకెండ్ పార్టీలో ఎవరికి నచ్చిన వారితో వారు ఎంజాయ్ చేయడం మామూలే. నటి జెన్నిఫర్‌కు క్రిస్ మార్టిన్ విషయంలో ఇలాంటిదే జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్ ఇంతకుముందు వుండేవాడని చెప్పింది. ఐతే ఇప్పుడతడు వీకెండ్‌లో పిలిచినా రావడం లేదట. అతడి వాలకం చూస్తుంటే నాతో డేటింగ్ బోరింగ్ కొట్టినట్లు ఉందనీ, తనకు తెలిసి మగాళ్లంతా వాడుకుని వదిలేస్తారని మండిపడుతోంది.
అందుకే బాయ్‌ఫ్రెండ్‌ను మార్చడంలో తప్పులేదని బాహాటంగా చెప్పేస్తోంది. అబ్బాయిలంతా ఆడవారిని వాడుకుని వదిలేస్తారని ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అబ్బాయిలు ముందుగా పరిచయం అయినప్పుడు బాగానే వుంటారనీ, ఆ తర్వాత క్రమేణా వారికి బోర్ కొడుతుందని అంటోంది. ప్రస్తుతానికి క్రిస్ కొత్త బాయ్ ఫ్రెండుతో డేటింగ్ మొదలెట్టేసిందట.