హాలీవుడ్ 'ది వైర్ స్టార్' మృతికి డ్రగ్సే కారణమా?

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:09 IST)
ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ కె. విలియమ్స్ మృతి చెందారు. ఆయన వయసు 54 యేళ్లు. ఈయన డ్రగ్స్‌కు బానిస కావడం వల్ల న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌లోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పోలీసులు వెల్లడిస్తున్నారు. 
 
హాలీవుడ్ నటుడు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా విచారణ జరుపుతున్నారు. మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల విలియమ్స్​ మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. 2002 నుంచి 2008 మధ్య అమెరికా కేబుల్‌ నెట్‌వర్క్‌ అయిన హెచ్‌బీఓలో 'ది వైర్‌' టెలివిజన్ సిరీస్‌ ప్రసారమైంది. దీనిద్వారా ఆయన మంచి గుర్తింపు పొందారు. 
 
డ్రగ్‌ డీలర్‌ పాత్రలో "ఓమర్‌ లిటిల్‌"గా ఆయన ఒక్కసారిగా వేల మంది అభిమానులను సంపాదించుకున్నారు. 'లవ్‌క్రాఫ్ట్ కంట్రీ' సిరీస్‌లో విలియమ్స్‌ ఉత్తమ నటనతో 2021 ఎమ్మీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. 'బోర్డ్‌వాక్‌ ఎంపైర్‌' సిరీస్‌లోనూ ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు