ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్ల దెబ్బకు కుప్పకూలిపోవడమే కాకుండా అధ్యక్షుడుతో పాటు ఎందరో ప్రభుత్వ అధికారులు పారిపోయారు. దీనితో ప్రభుత్వ ఆస్తులను ప్రజలు ఇష్టారాజ్యంగా తీసుకుని వెళ్లిపోయారు. కార్లు, ఆయుధాలు, వస్తువులు.. ఇలా ఒకటేమిటి ఎన్నో కబ్జా చేసేసారు.
మరోవైపు తాలిబన్లుకు వ్యతిరేకంగా వున్న కొన్ని దేశాలు వీరికి కాస్త వెన్నుదన్నుగా నిలిస్తే ఇక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ తాలిబన్ల పోరాటంగా మారే అవకాశం వుందన్న భయం వారిని వీడుతోంది. అందుకే మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆస్తులన్నిటినీ తీసుకు వచ్చి అప్పగించాలని తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. మరి వారి వార్నింగులను ప్రజలు పట్టించుకుంటారో లేదో వారం తర్వాత కానీ తెలియదు.